బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 35ఎ క్రింద (ఏఏసియస్) నిర్దేశాలు – ది అదూర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అదూర్, కేరళ – డిపాజిట్ ఖాతాల నుండి నగదు ఉపసంహరణ పై యున్న పరిమితి కి సడలింపు
ఆగష్టు 20, 2019 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 35ఎ క్రింద (ఏఏసియస్) నిర్దేశాలు – ది అదూర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అదూర్, కేరళ – డిపాజిట్ ఖాతాల నుండి నగదు ఉపసంహరణ పై యున్న పరిమితి కి సడలింపు భారతీయ రిజర్వు బ్యాంకు నవంబర్ 02, 2018 తేదీ నాటి డైరెక్ట్టివ్ ద్వారా ది అదూర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అదూర్, కేరళ ను తమ నిర్దేశాల క్రిందకు తీసుకు వచ్చింది. ఈ నిర్దేశాల ప్రకారం, డిపాజిటుదార్లు తమ పొదుపు ఖాతా, కరెంట్ ఖాతా లేక వేరే పేరు తొ పిలువబడే ఇతర డిపాజిట్ ఖాతాల మొత్తం నిల్వనుంచి కేవలం ₹ 2000/- (రెండువేల రూపాయలు మాత్రమే) కు మించకుండా వాపసు తీసుకోవడానికి, ఆర్బీఐ నిర్దేశాలలోని షరతులకు లోబడి, అనుమతింపబడ్డారు. భారతీయ రిజర్వు బ్యాంకు పై చెప్పబడిన బ్యాంక్ యొక్క ఆర్ధిక స్థితి ని సమీక్షించారు మరియు ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పైన ఉటంకించిన నిర్దేశాలను సవరించడం అవసరమని భావించారు. తదనుగుణంగా, ఆగష్టు 13, 2019 తేదీ నాటి సవరించిన డైరెక్ట్టివ్ ద్వారా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 35ఎ సబ్- సెక్షన్ (1) తో పాటు సెక్షన్ 56 క్రింద తనకు సంక్రమించిన అధికారాలతో భారతీయ రిజర్వు బ్యాంకు ఇందుమూలంగా అదేశిస్తున్నదేమంటే; ది అదూర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అదూర్, కు జారీచేసిన నవంబర్ 02, 2018 తేదీ నాటి డైరెక్ట్టివ్ లోని పేరా 1(i) ని సవరించాలని మరియు ఇకపిమ్మట, డిపాజిటుదార్లు తమ పొదుపు ఖాతా, కరెంట్ ఖాతా లేక వేరే పేరు తొ పిలువబడే ఇతర డిపాజిట్ ఖాతాల మొత్తం నిల్వనుంచి కేవలం ₹ 25,000/- (ఇరవైఐదు వేల రూపాయలు మాత్రమే) కు మించకుండా వాపసు తీసుకోవడానికి, ఆర్బీఐ వారి ఆగష్టు 13, 2019 తేదీ నాటి సవరించిన డైరెక్ట్టివ్ లో సూచించిన షరతులకు లోబడి, అనుమతించబడతారని. నవంబర్ 2, 2019 వ తేదీ నాటి డైరెక్టివ్ లోని అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులలో ఎటువంటిమార్పు లేదు. యోగేష్ దయాళ్ పత్రికా ప్రకటన: 2019-2020/477 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: