శ్రీ ఆనంద్ సహకార బ్యాంక్ లిమిటెడ్, చించ్‌వాడ్, పూణే, మహారాష్ట్ర - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35 A క్రింద నిర్దేశాలు - కాలపరిమితి పొడిగింపు
తేది: 24/11/2021 శ్రీ ఆనంద్ సహకార బ్యాంక్ లిమిటెడ్, చించ్‌వాడ్, పూణే, భారతీయ రిజర్వుబ్యాంకు, జూన్ 21, 2019 నాటి DCBS.CO.BSD-I/D-16/12.22.474/2018-19 ఆదేశానుసారం, శ్రీ ఆనంద్ సహకార బ్యాంక్ లిమిటెడ్, చించ్‌వాడ్, పూణే, మహారాష్ట్రను జూన్ 25, 2019 పని వేళల ముగింపు నుండి ఆరు నెలల కాలానికి నిర్దేశాల క్రింద ఉంచింది. నిర్దేశాల చెల్లుబాటు వ్యవధి కాలానుగుణంగా పెంచుతూ, చివరి సారిగా సెప్టెంబర్ 24, 2021 వరకు పొడిగించబడింది. 2. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,1949, సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 35A యొక్కసబ్ సెక్షన్ (1) లోఉన్న అధికారాలను వినియోగించుకుని, నవంబర్ 24, 2021 నాటి DOR.MON.D-48/12.22.474/2021-22 ఆదేశానుసారం పైన విధించిన అట్టి నిర్దేశాలు, సమీక్షకు లోబడి, ఫిబ్రవరి 24, 2022 వరకు బ్యాంక్‌కి వర్తిస్తాయని ప్రజలకు తెలియజేయడమైనది. 3. పైన సూచించబడిన నిర్దేశాల ఇతర నిబంధనలు మరియు షరతులలో మార్పులేదు. నిర్దేశాల పొడిగింపును తెలిపే నవంబర్ 24, 2021 నాటి ఆదేశం యొక్క ప్రతి, ప్రజా వీక్షణార్ధం బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడినది. 4. భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా పొడిగింపబడిన/మార్పుచేయబడిన ఫై నిర్దేశాలను, బ్యాంక్ యొక్క ఆర్ధిక స్థితిలో మెరుగుదలగా భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తి పడినట్లుగా అన్వయించుకోరాదు. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2021-2022/1246 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: