బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు - కరాడ్ జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్, కరాడ్, మహారాష్ట్ర - నిర్దేశాల పొడిగింపు
మార్చ్ 08, 2019 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు - కరాడ్ జనతా నవంబర్ 07, 2017 నాటి భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశం ప్రకారం, కరాడ్ జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్, కరాడ్, మహారాష్ట్ర, నవంబర్ 09, 2017 నుండి 3 నెలల కాలానికి నిర్దేశాల క్రింద ఉంచబడింది. సమయానుసారంగా అట్టి నిర్దేశాలను తదుపరి ఆదేశాలతో భారతీయ రిజర్వు బ్యాంకు పొడిగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో చివర ఇచ్చిన అక్టోబర్ 30, 2018 నాటి ఆదేశాల ప్రకారం అట్టి నిర్దేశం మార్చ్ 09, 2019 వరకు పొడిగింపబడింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949, సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A (1) క్రింద ఉన్న అధికారాలను వినియోగించుకుని, మార్చ్ 09, 2019 వరకు పొడిగింపబడిన అక్టోబర్ 30, 2018 నాటి నిర్దేశం, మరో 6 నెలలపాటు అంటే మార్చ్ 10, 2019 నుండి సెప్టెంబర్ 09, 2019 వరకు భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా పొడిగింపబడింది. పొడిగింపబడిన పై నిర్దేశాల యొక్క అన్ని ఇతర నిబంధనలు మార్పు లేకుండా యథా తథంగా ఉంటాయి. మార్చ్ 07, 2019 న జారీ చేసిన పొడిగింపబడిన నిర్దేశం యొక్క నకలు బ్యాంకు ప్రాంగణంలో, ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది. పైన పేర్కొన్న పొడిగింపు మరియు/లేదా సవరణలు, బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల, భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని అన్వయించుకోరాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/2138 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: