RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78520451
పంజాబ్ మరియు మహారాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ డిపాజిటర్లకు ఉపసంహరణ పరిమితిని, భారతీయ రిజర్వు బ్యాంకు 40,000/- కు పెంచింది

పంజాబ్ మరియు మహారాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ డిపాజిటర్లకు ఉపసంహరణ పరిమితిని, భారతీయ రిజర్వు బ్యాంకు 40,000/- కు పెంచింది

తేది : 14/10/2019

పంజాబ్ మరియు మహారాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ డిపాజిటర్లకు
ఉపసంహరణ పరిమితిని, భారతీయ రిజర్వు బ్యాంకు 40,000/- కు పెంచింది

పంజాబ్ మరియు మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ డిపాజిటర్లకు వారి ఖాతాల్లోని మొత్తం మిగులులో 25,000/- (ఇరవై ఐదు వేల రూపాయిలు మాత్రమే) తీసుకొనవచ్చునని భారతీయ రిజర్వు బ్యాంకు అక్టోబర్ 03, 2019 న అనుమతి ఇచ్చింది.

బ్యాంకు యొక్క ద్రవ్య లభ్యత మరియు దాని డిపాజిటర్లకు చెల్లించే సామర్థ్యాన్ని సమీక్షించిన తరువాత, ఉపసంహరణకు పరిమితిని ఇంతకుముందు అనుమతించిన ఇరవై ఐదు వేల రూపాయిలతో కలుపుకుని, 40,000/- (నలభై వేల రూపాయిలు మాత్రమే) కు పెంచాలని భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. పై సడలింపుతో, బ్యాంక్ డిపాజిటర్లలో 77% మంది, వారి మొత్తం ఖాతా మిగులు ను ఉపసంహరించుకోవచ్చు.

కొంతమంది వ్యక్తులు చేసిన మోసం కారణంగా బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితి గణనీయంగా బలహీనపడింది. ఈ విషయం భారతీయ రిజర్వు బ్యాంకు దృష్టికి వచ్చిన వెంటనే, ఒక ‘నిర్వాహకుడి’ని (అడ్మినిస్ట్రేటర్) నియమించడం మరియు బ్యాంకుకు అందుబాటులో ఉన్న వనరులు రక్షించబడటం మరియు దుర్వినియోగం లేదా మళ్లించబడకుండా చూసుకోవడం వంటి చర్యలు తీసుకోవడం జరిగింది.

ఈ క్రమంలో, బ్యాంకులోని మోసం/ఖాతా పుస్తకాల తారుమారు/ఆర్థిక అవకతవకలతో సంబంధం ఉన్న తన అధికారులు మరియు రుణగ్రహీతలపై బ్యాంకు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, ఆర్ధిక నేరాల విభాగం, మహారాష్ట్ర పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా, సంబంధిత లావాదేవీలను పరిశీలించడానికి ఫోరెన్సిక్ ఆడిటర్లను బ్యాంకు అడ్మినిస్ట్రేటర్ నియమించారు. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 36AAA(5)(a) ప్రకారం ఆర్బిఐ నియమించిన అడ్మినిస్ట్రేటర్ మరియు ముగ్గురు సభ్యుల సలహా కమిటీ, కార్యకలాపాల నిర్వహణలో బ్యాంకు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వేగంగా పరిష్కరించడానికి కృషి చేస్తోంది.

రిజర్వ్ బ్యాంక్ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది మరియు బ్యాంక్ డిపాజిటర్ల ప్రయోజనార్థం అవసరమైన చర్యలు నిరంతర ప్రాతిపదికన తీసుకుంటోంది.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/942

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?