ఇండియన్ మర్కేంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పై భారతీయ రిజర్వు బ్యాంకు నగదు జరిమానా విధింపు.
అక్టోబర్ 09, 2018 ఇండియన్ మర్కేంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పై భారతీయ రిజర్వు బ్యాంకు నగదు జరిమానా విధింపు. భారతీయ రిజర్వు బ్యాంకు సెప్టెంబర్ 26, 2018 తేదీనాటి ఆర్డర్ ద్వారా ఇండియన్ మర్కేంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆ బ్యాంక్) పై, బ్యాంక్ కు జారీ చేసిన సంఘటిత ఆదేశాలను (అల్ ఇంక్లూసివ్ డైరెక్షన్స్ – ఏఐడి లు) అతిక్రమించినందుకు మరియు ఫ్రాడ్స్ వర్గీకరణ మరియు రిపోర్టింగ్ పై ఆర్బీఐ సూచనలను అమలుపరచనందుకు ₹ 2 మిలియన్ల నగదు జరిమానా విధించింది. ఇతః పూర్వం పేర్కొన్ననిబంధనలకు సంబంధించి తమ ఆదేశాలను మరియు సూచనలను అమలుపరచడంలో వైఫల్యంచెందినందులకు గాను బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 47A (1)(c) రెడ్ విత్ సెక్షన్ 46 (4)(i) మరియు సెక్షన్ 56 నిబంధనల క్రింద రిజర్వు బ్యాంకుకు దఖలుపరచబడిన అధికారాలతో, ఈ జరిమానాను విధించడం జరిగింది. ఈ చర్యను, నియంత్రణలు పాటించడంలో లోపాల మూలంగా మాత్రమే తీసుకోబడిoదితప్ప, వారి ఖాతాదార్లతో జరిపిన ఏ లావాదేవీ లేదా ఒప్పందాల చెల్లుబడి మీద తీర్మానం చెప్పినట్లుగా భావింపరాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/832 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: